ఎల్.బి నగర్ ప్రజల సమగ్రాభివృద్దే ద్యేయం

 ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి దైద జగదీశ్వర్

హైదరాబాద్ : ఎల్.బి నగర్ ప్రజల సమగ్రాభివృద్ధికి కృషి చేయడమే ధ్యేయమని ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి దైద జగదీశ్వర్ అన్నారు.

గురువారం ఎల్.బి నగర్ లోని వారి పార్టీ ఎన్నికల కార్యాలయంలో ధర్మఘంట'తో మాట్లాడుతూ ఎల్.బి నగర్ ప్రజల సమగ్రాభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా పనిచేసే తనకు ఓటువేసి అంబేద్కర్ ఆశయాలను, ఓఫీరిజంను గెలిపించాలని ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి దైద జగదీశ్వర్ కోరారు. 

కుల, మత, వర్గ, జాతి, లింగ, ప్రాంతీయ, స్వ- పర విభేదాలతో కృంగిన దేశానికి "ఓఫీరిజం" మాత్రమే భరోసా అని, సామాజిక మార్పుకోసం ప్రత్యామ్నాయ రాజకీయ సమీకరణాలు అత్యవసరమని, ప్రజలను నవ చైతన్య మార్గంలో నడిపించి, ఒక ‘శ్రేష్ఠతరమైన’ ఎల్బీ నగర్ ను నిర్మించే సంకల్పం ఏపార్టీకి లేదని, ఆయా పార్టీలు స్వాతంత్ర్య పొందిన నాటి నుండి  పేదలకు ఒరగబెట్టింది ఏమి లేదని, సామాన్యుల సమగ్రాభివృద్దే ద్యేయంగా పనిచేస్తానని అన్నారు.

పూలే అంబేడ్కర్ ఆశయాలే "ఓఫీరిజం" అని, భారత మహనీయుల కళల సౌదమే "ఓఫీరిజం" మార్గమని, ఆకలి, ఆత్మగౌరవలే "ఓఫీరిజం" పునాదులుగా ఉన్నాయని, అందుకే "ఓఫీరిజం" స్థాపనే లక్ష్యంగా రూపొందిన ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా ఎల్బీ నగర్ ప్రజల ముందు నిలిచానని అన్నారు.

ఇండియా ప్రజాబంధు పార్టీ నాయకులు గార్లపాటి రమేష్, పగిడి రాజ్ కుమార్, మర్థన్ పెల్లి ఆనంద్, పాముల రామచందర్ రావు, మిర్యాల హనుమంతు తదితరులు ఆయన వెంట ఉన్నారు.