కేవలం రూ.87 తో రూ.11 లక్షల రాబడి.. ఈ స్కీమ్ అదుర్స్ అంతే..


జీవితంలో ఊహించని ఆపదలు, ప్రమాదాలు ఎదురుకావచ్చు. అలాంటి సందర్భాలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉండాలి. అలాంటి భరోసానే ఇన్సూరెన్స్‌ పాలసీలు అందిస్తాయి.

పిల్లలు, పురుషులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించేలా ప్రముఖ ఇన్సూరెన్స్‌ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీలను రూపొందించింది.

ఎల్ఐసీ లో-రిస్కు, కన్సూమర్‌-సెంట్రిక్‌ పాలసీలకు ప్రసిద్ధి చెందింది. విభిన్న ఆర్థిక లక్ష్యాలు, అవసరాలను తీర్చే చాలా రకాల పాలసీలను ఎల్‌ఐసీ అందిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా 'ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్‌ (LIC Aadhaar Shila Plan)'ను తీసుకొచ్చింది. ఎల్‌ఐసీ ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు ఆదా చేయవచ్చు

ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్

ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ అనేది నాన్‌లింక్డ్‌ ఇండివిడ్యువల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌. మహిళా పాలసీదారుల కోసం రూపొందించారు. ఈ ప్లాన్‌లో భాగంగా.. ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తికి మెచ్యూరిటీ తర్వాత ఫిక్స్‌డ్‌ అమౌంట్‌ అందిస్తారు. ఆమె అకాల మరణం చెందితే కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తారు.

రూ.87తో రూ.11 లక్షల వరకు ఆదా చేయడం ఎలా?

ఒక ఉదాహరణ పరిశీలిస్తే.. 55 ఏళ్ల మహిళ 15 ఏళ్లపాటు రోజుకు కనీసం రూ.87 చొప్పున ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో కాంట్రిబ్యూట్‌ చేసిన మొత్తం రూ.31,755 అవుతుంది. పదేళ్లకు కాంట్రిబ్యూట్‌ చేసిన అమౌంట్‌ రూ.3,17,550కి చేరుతుంది. చివరగా 70 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తి మొత్తం రూ.11 లక్షలు పొందేందుకు అర్హులు

.ప్లాన్ వివరాలు

ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ స్కీమ్‌కు కనీస ప్రవేశ వయస్సు 8 సంవత్సరాలు. గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు. పెట్టుబడిదారులు కనీసం 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి, గరిష్టంగా 20 సంవత్సరాల వరకు పాలసీ వ్యవధి ఉండవచ్చు.

గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంది. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులు కనీసం రూ.75,000 నుంచి గరిష్టంగా రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రయోజనాలు

- ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్‌

ప్రీమియం పేమెంట్‌ కాలవ్యవధి పాలసీ వ్యవధికి అనుగుణంగా ఉంటుంది. పాలసీదారు ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా యాన్యువల్‌, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ చెల్లించవచ్చు.

- లోన్ ప్రయోజనాలు

పాలసీ సరెండర్ విలువను సాధించిన తర్వాత, పెట్టుబడిదారులు తమ పాలసీ ఆధారంగా లోన్ తీసుకోవచ్చు.

- సరెండర్ ఆప్షన్‌

పాలసీదారులకు వరుసగా రెండు పాలసీ సంవత్సరాలు పూర్తయిన తర్వాత వారి పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంటుంది. పాలసీ వ్యవధిలో చెల్లించాల్సిన హామీ సరెండర్ వ్యాల్యూ, చెల్లించిన మొత్తం ప్రీమియంతో సమానంగా ఉండాలి.

- డెత్ బెనిఫిట్స్

పాలసీదారు అకాల మరణం చెందితే, ప్లాన్ డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తుంది. పాలసీలో పేర్కొన్న నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ అందిస్తారు.

- మెచ్యూరిటీ బెనిఫిట్

పాలసీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఇన్సూరెన్స్‌ పొందిన వ్యక్తి మెచ్యూరిటీ బెనిఫిట్‌ పొందేందుకు అర్హులు. ఆర్థిక భవిష్యత్తును మరింత సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ ఏక మొత్తాన్ని కొత్త పాలసీలో మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు.