నాలుగేళ్ల కిడ్ లో... 15 ఎం ఎం కిడ్నీ స్టోన్

 హెల్తీ పై హాస్పిటల్ లో విజయవంతంగా రిస్కీ ఆపరేషన్

సూర్యాపేట: నాలుగేళ్ల బాలుడి మూత్రపిండంలో 15 ఎం.ఎం పరిమాణంలో ఉన్న రాయిని అత్యంత భద్రత ప్రమాణాల మధ్య శస్త్ర చికిత్స పూర్తి చేసి బాలుడిని ఆరోగ్యవంతంగా డిజార్జి చేసిన ఘనత సూర్యాపేట పట్టణంలోని హెల్తీ పై హాస్పిటల్ సాధించింది .

ఈ కేసుకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుంగతుర్తి కేంద్రానికి చెందిన అండెం శివాన్స్ (4 సంవత్సరాలు) తండ్రి: సైదులు అనే బాలుడు గత నెల రోజుల నుండి మూత్రంలో మంట, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడు.ఈ విషయంలో సూర్యాపేట పట్టణంలోని రెండు మూడు ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగినప్పటికీ ఎక్కడ సమస్యకి కారణం సరిగ్గా తెలియలేదు. తెలిసిన వారు చేసిన సూచన మేరకు బాధిత కుటుంబ సభ్యులు పట్టణంలోని హెల్తీపై ఆస్పత్రికి వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోగా కిడ్నీలో 15 ఎం .ఎం పరిమాణంలో రాయి ఉన్నట్లు తేలింది .

బాబు వయసు కేవలం నాలుగు సంవత్సరాలు కావటం , రాయి పరిణామం చాలా పెద్ద స్థాయిలో ఉండటం , హిమోగ్లోబిన్ శాతం కేవలం 9 కావటం తో, పాటు బాబు తీవ్ర దగ్గుతో కూడా ఉండటంతో ఆపరేషన్ ప్రక్రియ కఠిన తరం అయింది . ఇలాంటి విపరీత అనుకూలతల మధ్య కూడా హెల్తీపై హాస్పిటల్ బృందం అవిశ్రాంతంగా కృషిచేసి అత్యాధునిక లాప్రోస్కోపిక్ విధానం ద్వారా  పూర్తి ఉచితంగా (ఆరోగ్య శ్రీ పథకం కింద) ఆపరేషన్ నిర్వహించి బాబుని పరిపూర్ణ ఆరోగ్యవంతంగా నేడు శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేయటం జరిగింది.


 ఈ మేరకు హాస్పిటల్ వ్యవస్థాపక చైర్మన్ మతకాల చలపతిరావు మాట్లాడుతూ అంకితభావంతో పని చేసి సత్ఫలితాలు చూపెట్టే తమ వైద్య బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఎలాంటి వైద్య కష్టతరమైన సమస్యలు ఉన్న ప్రజలైన ఏ సమయంలోనైనా తమ హాస్పిటల్ ను సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవచ్చని ఆయన సూచించారు