అంబేద్కర్ అభయహస్తం డిక్లరేషన్.ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలి


 దళిత గిరిజన ఆదివాసి జేఏసీ డిమాండ్

మాజీ మంత్రి వర్యులు మోత్కుపల్లి నర్సింహులు కి మొదటి ఆహ్వాన పత్రిక ను అందించిన దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి నాయకులు

హైదరాబాద్: అంబేద్కర్ అభయ హస్తం సాధనకోసం డిక్లరేషన్ పై దళిత గిరిజన ఆదివాసి జె. ఏ. సి జూన్ 26 న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం పలుకుతూ మోత్కుపల్లి నర్సింహులును వారి స్వగృహ మందు కలిసి పుష్ప గుచ్చం అందించి మొట్టమొదటి ఆహ్వాన పత్రికను అందించి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

దళిత గిరిజన ఆదివాసి జె ఏ సి నాయకులు కండెల వెంకటేశ్వర్లు ముత్యపాగ నర్సింగ్ రావ్, బొంకూరి సురేందర్ సన్ని, తదితరులు ఈ కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్నారు.