పాస్టర్ ప్రవీణ్ పగడాల, అడ్వకేట్ ఇజ్రాయల్ మరణం బాధాకరం
వీరి హత్యలపై నిష్పాక్షంగా విచారణ జరగాలి
కావాలనే తెలంగాణలో క్రైస్తవుల మీద వివక్ష చూపుతున్నారు
నానాటికి పెరుగుతున్న క్రైస్తవుల హత్యలు ఆందోళనకరం
హైదరాబాద్: 27 మార్చి 2025 (ధర్మఘంట ప్రతినిధి): తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత పెద్దలు పాస్టర్ ప్రవీణ్ పగడాల, దళిత క్రైస్తవ అడ్వకేట్ ఇజ్రాయల్ హత్యలపై కావాలనే ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మైనార్టీ నేతలు అడ్వకేట్ ఇజ్రాయిల్, పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.... పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ఒంటి మీద ఎక్కడ యాక్సిడెంట్ గాయాలు కాకుండా ఎవరో హింసించిన విధంగా గాయాలు ఉన్నాయని అయిన కావాలనే అక్కడి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరింస్తుందన్నారు. ఉదయం ఘటన జరిగితే రాత్రి 8.30 వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వివరించారు. అక్కడి ఎన్డీఏ కూటమి ఎవరీ సంతోషం కోసం క్రైస్తవుల హత్యలను ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. నిష్పాక్షపాతంగా రాజకీయ ఒత్తిడి లేకుండా విచాణ జరగాలని లేదంటే ఏదైనా దర్యాప్తు సంస్ధకు ఈ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు.
అలాగే దళిత క్రైస్తవుడు అడ్వకేట్ ఇజ్రాయల్ హత్య గావించబడడం బాధాకరమన్నారు. తెలంగాణలో దళిత క్రైస్తవ న్యామవాదికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇజ్రాయల్ హత్యకు గురైతేనిందితుడి ఇంటి దగ్గర బందోబస్తు పెట్టిన రాష్ట్ర సర్కార్ ఇజ్రాయల్ కుటుంబాన్ని మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఎన్డీఏ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలనే క్రైస్తవుల మీద దాడులకు దిగుతున్న పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉన్న బీజేపీ ఎజెండానే కొనసాగుతుందని తెలిపారు. దేశంలో క్రైస్తవుల హత్యలు నానాటికి పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలల కాలంలో 120 మంది క్రైస్తవులు చనిపోయారని తెలిపారు. అలాగే ఏపీలో 37 మంది మన తెలంగాణలో 25 మంది హత్యకు గురైయ్యారని వివరించారు. ఈ గణాంకాలు చూస్తుంటే దేశంలో క్రైస్తవులకు రక్షణ ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందన్నారు. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ సమాజం ఆలోచన చేయాలని క్రైస్తవులు ఐక్యంగా ఉండి ప్రజల్లో మమేకమైన క్రైస్తవ నాయకులకు అండగా ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో క్రైస్తవుల పట్ల వివక్ష కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో క్రైస్తవులకు చోటు లేదని అలాగే కనీసం చట్టసభల్లో కూడా క్రైస్తవులకు ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణలో క్రైస్తవులకు సంబంధించి ఉన్న ఒకేఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే పదవి రద్దుకు ఇప్పటీ సీఎం రేవంత్ రెడ్డి కారణమన్నారు. ఆంగ్లో ఇండియన్ పదవిని రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ గా, ఎంపీగా పలుమార్లు ఫిర్యాదు చేసి బీజేపీ ప్రభుత్వంతో తనకు ఉన్న చనువుతో రద్దు చేయించాడని మండిపడ్డారు. దాని తరువాత తెలంగాణలో క్రైస్తవులకు ప్రాతినిధ్యం కరువైందన్నారు.
కులగణనలో సైతం క్రైస్తవ జనాభా చూపించలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ కావాలనే క్రైస్తవుల జనాభాను దాచిపెడుతుంది. జనాభా ప్రకారం ఎక్కడ క్రిస్టియన్లు రిజర్వేషన్లు రాజకీయ పదవులు అడుగుతారనే భయంతో బీజేపీతో కలిసి కాంగ్రస్ ప్రభుత్వం కులగణన లెక్కలు చెప్పలేదన్నారు.
ఈ మీడియా సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, క్రిస్టియన్ జెఎసీ చైర్మన్ సాల్మోన్ రాజ్, రిటైర్డ్ జడ్జి రాజ్ కుమార్, లీగల్ రైట్ ఆక్టివిస్ట్ జిమ్మీ కిరణ్, క్రిస్టియన్ జెఎసీ ఉపాధ్యక్షులు జి .విద్యా సాగర్, జెఎసీ ట్రెజరరీ కెజె కెన్నెడీ, రోమన్ క్యాథలిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లియో లూయిస్, సీనియర్ హైకోర్టు న్యాయవాది ఎన్ పీ రాజు, దళిత క్రైస్తవ ఐక్య వేదిక నాయకులు మోసెస్, సనత్ నగర్ సీఎస్ఐ నాయకులు ప్రణయ్ కుమార్, ఎంబీ చర్చి కౌన్సిల్ మెంబర్ మోజెస్, జెఎసీ సెక్రెటరీ డి రాజేష్ లతో పాటు పలువురు క్రిస్టియన్ నాయకులు పాల్గొన్నారు.